భారతదేశం, నవంబర్ 6 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో శ్రీవల్లి గురించి ధీరజ్, నర్మద, ప్రేమ మాట్లాడుకుంటారు. వల్లిని ప్రేమ క్షమించలేకపోతుంది. అన్నయ్య కోపంలో ఆ మాటలు అన్నాడు కానీ వల్లి వదినపై ప్రేమ ఉండే ఉంటుందని ధీరజ్ అంటాడు.

నేను ఒప్పుకోను అని ప్రేమ అంటుంది. ధీరజ్, ప్రేమ గొడవ పెడతారు. ధీరజ్ వెళ్లిపోతాడు. నీకు నచ్చింది చేసుకో అని నర్మదను అనేసి ప్రేమ వెళ్లిపోతుంది. చందు అన్న మాటల గురించి నర్మద ఆలోచిస్తుంది. వల్లికి కాల్ చేస్తుంది నర్మద. నీ ఫోన్ కోసమే రాత్రంతా ఎదురుచూస్తున్నాను. మావయ్య మాట్లాడారా. చందు బావ విన్నాడా. విడాకులు రిటర్న్ తీసుకుంటా అన్నాడా అని వల్లి అడుగుతుంది.

నేను చెప్పేది విను. కానీ భయపడకు, బాధపడకు. నీకు పరిస్థితి తెలియాలని చెబుతున్నాను. అత్తయ్య, మావయ్య ఎంత నచ్చజెప్పిన బావగారు ...