భారతదేశం, నవంబర్ 23 -- Illu Illalu Pillalu November 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లి కోసం భాగ్యం ఇంటికి నర్మద వస్తుంది. నర్మదను చూడగానే సంతోషంతో హగ్ చేసుకొని వల్లి ఏడ్చేస్తుంది. ఈ విషయం ఫస్ట్ నీతోనే చెప్పాలనుకున్నానని నర్మద చేతిని తన కడుపుపై పెట్టుకుంటుంది వల్లి.

వల్లి తల్లి అయిందని నర్మదకు తెలుస్తుంది. నువ్వు చెప్పేది నిజమేనా? ఇంత శుభవార్త ఇంత లేటుగా చెప్తారా? ఈ విషయం ఇంటికి వచ్చి అందరికీ చెప్పాల్సింది కదా అని నర్మద ఆనందంగా చెప్తుంది. ఈ విషయం ఆ ఇంట్లో చెప్తే ఎలా రియాక్టవుతారో తెలియదు కదా అని ఆగానని వల్లి అంటుంది. ఈ రోజు దీపావళి. ఈ శుభవార్త చెప్పేందుకు వెళ్దామని నర్మద అంటుంది.

కానీ వల్లి మాత్రం కదలదు. బిడ్డను అడ్డం పెట్టుకొని ఆ ఇంటికి వస్తున్నానని అంటారు. అందరూ క్షమించాకే ఆ ఇంట్లోకి వస్తానని వల్లి అంటు...