భారతదేశం, నవంబర్ 17 -- Illu Illalu Pillalu November 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ట్రావెల్ ఏజెన్సీకి తన పేరు పెట్టడంపై వేదవతితో మురిసిపోతూ రామరాజు మాట్లాడతాడు. చిన్నోడు, చిన్న కోడలి గురించి బెంగ లేదు. నా బాధంతా పెద్దోడు చందు గురించే. వాడు త్వరగా ఆ బాధ నుంచి బయటపడాలని రామరాజు అంటాడు.

పెద్దోడు ఆ బాధ నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుంది. మీరు ఏం అనకండి, ఏం అడక్కండని భర్తకు వేదవతి చెప్తుంది. మరి నడిపోడి గొడవ ఏంటీ? రూ.20 లక్షలు తెస్తానన్నాడు కదా అని రామరాజు అంటాడు. మీరు వాడి జోలికి వెళ్లకండి. వాడు కష్టపడతా అంటున్నాడు కదా అని వేదవతి చెప్తుంది. వాడు ఆవేశంలో ఏం గొడవలు తెస్తాడో అని కంగారుగా ఉందని రామరాజు అంటాడు.

మరోవైపు ఎవరో వ్యక్తి నుంచి లంచం తీసుకొని ఫైల్ ఇస్తాడు సాగర్. ఇదంతా అతని ఫ్రెండ్ వీడియో తీస్తాడు. ప్రాబ...