భారతదేశం, మే 4 -- Illu Illalu Pillalu May 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 4 ఎపిసోడ్ లో.. ఫ్రెండ్ ను డబ్బు అడిగినట్లు ధీరజ్ దగ్గర ప్రేమ నాటకం ఆడుతుంది. ధీరజ్, ప్రేమ కలిసి ఇంటికి వస్తారు. పొద్దున్నే ప్రేమ పావురాలు ఎక్కడికి వెళ్లాయని నర్మద అడుగుతుంది. ఏంటి మీ అక్కకు కూడా చెప్పలేదా? అని ప్రేమను ధీరజ్ అడుగుతాడు.

ప్రేమ, ధీరజ్, నర్మద నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటే శ్రీవల్లి చూసి తట్టుకోలేకపోతుంది. వీళ్లు ఇంత హ్యాపీగా ఉండకూడదని బెల్ తీసి వల్లి మోగిస్తుంది. పెద్ద వదిన.. అసలే కోతి, ఆపై కళ్లు తాగింది, కొబ్బరి చిప్ప దొరికిందన్నట్లు బెల్ దొరికాక ఆగట్లేదని ధీరజ్ పంచ్ వేస్తాడు. వేడివేడిగా మిరపకాయ బజ్జీలు కావాలని వల్లి అడుగుతుంది.

ప్రేమ, నర్మద కలిసి బజ్జీలు వేస్తారు. బజ్జీలు తీసుకొచ్చి వల్లికి ఇస్తారు. అప్పుడే బట్టలు ఉతుకుతానని అంటుంది వల...