భారతదేశం, మే 1 -- Illu Illalu Pillalu May 1 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు ఇంట్లో ఆస్తి చిచ్చు రగులుతుంది. వాటా అడగడంలో తప్పు లేదని సాగర్ రెచ్చిపోతాడు. మరోవైపు శ్రీవల్లి కడుపులో బిడ్డ లేదని చెప్పాలనుకున్న ఇడ్లీ బాబాయ్ ను భాగ్యం అడ్డుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 1 ఎపిసోడ్ లో చూద్దాం.

జరిగిన గొడవ తలుచుకుంటూ ధీరజ్ ఫీల్ అవుతాడు. నా మీద చాలా కోపంగా ఉంది కదా. నీ బాధ నాకు తెలుస్తుంది. కారణం నేనే. సారీ అని ప్రేమ చెప్తుంది. నేనే మిస్టేక్ చేశా. అనవసరంగా ష్యూరిటీ సంతకం పెట్టమని బావను తీసుకెళ్లానని ధీరజ్ అంటాడు. మీ బావనే నేనే అడిగా కదా, ఇదంతా జరగడానికి కారణం నేనే కదా అని ప్రేమ అంటుంది.

నగలు తీసుకోమన్నా తీసుకోవడం లేదు. డౌన్ పేమెంట్ కు డబ్బులు లేవు. అందుకే మీ బావను అడిగా. నా భర్తకు జరిగిన అవమానాన్ని ...