భారతదేశం, జూలై 7 -- Illu Illalu Pillalu July 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 7 ఎపిసోడ్ లో వల్లిని పుట్టింటికి లాక్కెళ్తుంది వేదవతి. కాపురం కూలిపోవడంతో ప్రాణాలు తీసుకోవడానికి వల్లి బావిలోకి దూకేస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

శ్రీవల్లి కడుపు డ్రామా అని తెలిసి వేదవతి ఫుల్ ఎమోషనల్ అవుతుంది. పెద్ద కోడలిపై ఫుల్ ఫైర్ అవుతుంది. మీరు మోసం చేశారని తెలిస్తే ఆయన తట్టుకోగలరా? ఆయన చూసిన సంబంధం అని పెద్ద కోడలు గురించి గొప్పగా చెప్పుకుంటారు. కానీ నిజం తెలిస్తే ఏమైపోతారో అని వల్లితో వేదవతి అంటుంది.

నన్ను ఈ ఇంటికి పంపేందుకు మా అమ్మ అలా చేసిందని శ్రీవల్లి ఏడుస్తూ చెప్తుంది. నోర్మూయ్ అని వేదవతి గట్టిగా అరుస్తుంది. మేం ఏం పాపం చేశామని ఇంత దారుణంగా మోసం చేశావ్. నీ కడుపులో బిడ్డ ఉందని మేం ప్రేమలు పెంచుకుంటుంటే, అయ్యో పాపం అ...