భారతదేశం, జూలై 28 -- Illu Illalu Pillalu July 28 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో భద్రావతి, సేనాపతి, శ్రీవల్లి కుట్ర సక్సెస్ అవుతుంది. సేనాపతిని ధీరజ్ కొడతాడు. ప్రేమ పెళ్లి నిజాన్ని అందరికీ చెప్పేస్తాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

భోజనాలు చేస్తున్న సమయంలో కావాలనే ధీరజ్ ను అవమానించేలా సేనాపతి మాట్లాడతాడు. మా ఆస్తి కోసం నా కూతురిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని సేనాపతి అంటాడు. అన్నయ్య నిజానిజాలు తెలియకుండా మాట్లాడకు అని వేదవతి అరుస్తుంది. ఇదే నిజం. మా కారు డ్రైవర్ గా కూడా పనికి రానివాడిని నా కూతురు పెళ్లి చేసుకుంటుందా? అని సేనాపతి మరీ దారుణంగా మాట్లాడతాడు.

కచ్చితంగా వీడు నా కూతురిని ట్రాప్ చేశాడని సేనాపతి అంటాడు. నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని వేదవతి అంటుంది. కానీ సేనాపతి మళ్లీ అదే మాట...