భారతదేశం, జూలై 27 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్, ప్రేమ ఒకరికొకరు సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. ప్రేమ ఇచ్చిన షర్ట్ తీసుకున్న ధీరజ్ తన ఫేవరెట్ కలర్ అని మురిసిపోతాడు. మన రెండు కుటుంబాలు కలిసిపోయాయి కాబట్టి అందరి సమక్షంలో మనం మళ్లీ పెళ్లి చేసుకుందాం. అందరితో అక్షింతలు వేయించుకుందామని ప్రేమ అంటుంది.

లోపల మురిసిపోయిన ధీరజ్ పైకి మాత్రం సెటైర్లు వేస్తాడు. చీర కట్టుకోవాలని ధీరజ్‌ను పంపిస్తుంది ప్రేమ. నీకు చీర కట్టుకోవడం వచ్చినప్పుడు నన్ను ఉదయం ఎందుకు కట్టమన్నావ్ అని అడుగుతాడు ధీరజ్. దాంతో దొరికిపోయానే అని ప్రేమ అనుకుంటుంది. నీకు వచ్చా రాదా అని టెస్ట్ చేశానని ధీరజ్‌ను పంపిస్తుంది ప్రేమ.

తన పుట్టింటివాళ్లకు ఆకలేస్తుంటుంది అని హడావిడి చేస్తుంది వేదవతి. ఇంట్లో రెండు కుటుంబాలు దిగిన ఫొటో...