భారతదేశం, ఆగస్టు 7 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో విశ్వ తను మారినట్లు ఇంట్లో జరిగిన గొడవను ఎగ్జాంపుల్‌గా చెబుతాడు. ఇంతకంటే రుజువులు లేవు. మా చెల్లిని మీ అన్నయ్యతో కలపాలన్నదే నా ఉద్దేశం. నువ్వు అర్థం చేసుకుని నాకు కాస్తా సపోర్ట్‌గా ఉంటే ఇద్దరిని కలపొచ్చు. లేదంటే నీ ఇష్టం. ఇక నిన్ను బతిమిలాడను అని దండం పెట్టి విశ్వ వెళ్లిపోతాడు.

దాంతో అమూల్య ఆలోచిస్తుంది. మరోవైపు ప్రేమ కాలేజ్‌లో ధీరజ్ కారులో వెయిట్ చేస్తుంటాడు. ప్రేమ ఇక్కడ ఎలా ఎగురుద్దో, ఆడదాన్ని అర్థం చేసుకోవడం కంటే అణుబాంబు తయారు చేయడం ఈజీ అని ధీరజ్ అనుకుంటాడు. ప్రేమ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తానని ఫ్రెండ్‌తో చెబుతుంది. ప్రేమ క్యాబ్ బుక్ చేస్తే అది ధీరజ్‌కే వెళ్తుంది.

కారు దగ్గరికి వచ్చి క్యాబా అని ప్రేమ అడిగితే ధీరజ్ ఉంటాడు. ను...