భారతదేశం, ఆగస్టు 19 -- Illu Illalu Pillalu August 19 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. పుట్టింట్లో ప్రేమ, ఇటు ధీరజ్ బాధపడుతూ కూర్చుంటారు. తమ ప్రేమ జ్ణాపకాలను గుర్తు చేసుకుంటుంటారు. ప్రేమను బాధను చూసి భద్రావతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ దగ్గరకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తుంది.

ప్రేమ నిన్ను ఎలా ఓదార్చాలో? ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నీ చేతి మీద కళ్యాణ్ అని పేరు రాశావని అడిగినందుకు ధీరజ్ అంత నీచంగా మాట్లాడతాడా? కష్టమో ఇష్టమో పెళ్లి చేసుకున్నారు. కలిసి ఉన్నారు. కోపం తగ్గిన తర్వాత ధీరజ్ వచ్చి అడిగితే పంపించేద్దామనుకున్నానని భద్రావతి నాటకం ఆడుతుంది.

మీ మధ్య జరిగిన గొడవలను అవకాశంగా తీసుకొని వేరు చేయాలని చూడలేదు. ధీరజ్ రోజురోజుకూ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడో చూస్తున్నావ్ కదా. కళ్యాణ్ తో లేచిపోయావని ఆ రోజు ఏదో కో...