భారతదేశం, ఆగస్టు 16 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో లంచం డబ్బులు ఫిక్స్‌డ్ డబ్బులు అని చెప్పి నర్మదను ఏమార్చి మల్లెపూలు పెడతాడు సాగర్. ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. నీ కళ్లేంటీ ఇంత డేంజరస్‌గా ఉన్నాయి, మల్లెపూల కంటే మత్తెక్కిస్తున్నాయి, పెదాలు కూడా మాట్లాడుతున్నాయి గుర్తుండిపోయేలా చిలిపి సంతకం చేయమని సాగర్ కవిత్వం చెబుతాడు.

నర్మదకు లిప్ కిస్ పెడతాడు సాగర్. దాంతో సిగ్గుతో పక్కకు జరుగుతుంది నర్మద. వెనుకనుంచి నర్మదను హగ్ చేసుకుంటాడు సాగర్. రొమాంటిక్‌గా కవిత్వతంతో మాట్లాడుతాడు సాగర్. దాంతో నర్మద మురిసిపోతుంది. మరోవైపు రాత్రి ఎవరు చూడకుండా భద్రావతి ఇంట్లోకి ధీరజ్ దూరతాడు. ప్రేమ గదిలోకి వెళ్తాడు. ప్రేమ ప్రశాతంగా పాటలు విని పడుకుంటుంది.

అంత ట్రాన్స్‌లో ఏం పాటలు వింటుందని ధీరజ్ కూడా ఇయర్ ఫోన...