భారతదేశం, ఆగస్టు 13 -- Illu Illalu Pillalu August 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. గుడిలో జరిగిన హైడ్రామాతో ధీరజ్ తనకు వద్దే వద్దని ప్రేమ చెప్తుంది. కోపం రాగానే నాకు ఇచ్చిన మాట తప్పాడు. రేపు కోపమొస్తే ఏదైనా చేస్తాడు కదా. నన్ను అందరి ముందు నవ్వుల పాలు చేశాడు. ఆడపిల్ల మనసును అర్థం చేసుకోలేని భర్త నాకొద్దు అని ప్రేమ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వెళ్లిపోతుంది.

ప్రేమ మాటలకు ధీరజ్ ఇంకా కుమిలిపోతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. నా కాపురాన్ని కూల్చేసిన శత్రువు కాపురం ముక్కలైంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని బల్లక్కాయ్ సైకో ఆనందం పొందుతుంది. సీన్ కట్ చేస్తే భాగ్యం ఇంట్లో అందరూ ప్రేమ ప్రేమ నీకు ఇది న్యాయమా అనే సాంగ్ పెట్టుకుని ఏడుస్తుంటారు.

శ్రీవల్లి సాంగ్ ఆపేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిని ఆ ప్రేమ ఎలా వద్దనుకుందని అ...