భారతదేశం, ఏప్రిల్ 9 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమకు యాక్సిడెంట్ తో కథ మలుపు తిరిగింది. చందును చంపించడం కోసం సేనాపతి వేసిన కుట్రకు తన కూతురే బలి కావాల్సి వచ్చింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 9 ఎపిసోడ్ లో చూసేద్దాం.

చందు బావ వైపు లారీ దూసుకురావడం ప్రేమ చూస్తుంది. బావ అని పిలిచినా చందుకు వినిపించదు. వెంటనే ప్రేమ పరుగెత్తుకెళ్లి చందును పక్కకు లాగేస్తుంది. అప్పుడు లారీ ప్రేమను ఢీ కొడుతుంది. అది చూసి ధీరజ్ పరుగెత్తుకుంటూ వెళ్తాడు. ప్రేమను హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు.

ధీరజ్ బాధతో కుమిలిపోతుంటాడు. ప్రేమకు ఏం జరుగుతుందోననే కంగారుతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. చందును హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. ప్రేమ పట్ల తాను కఠినంగా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటు ఇంకా బాధపడతాడు. రామరాజు ఫ్యామిలీ అందరూ హాస్ప...