భారతదేశం, ఏప్రిల్ 6 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఏప్రిల్ 6 ఎపిసోడ్ లో.. తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నావంటూ ధీరజ్ తో చెప్తూ ప్రేమ ఏడుస్తుంది. అమూల్య విషయంలో తాను ఏ తప్పు చేయలేదని అంటుంది. నా మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉందని చెప్తుంది. కానీ ధీరజ్ మాత్రం కరగడు.

నీ కంటే ముందే నా ప్రేమ మొదలైంది. నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత నా ప్రేమను చెప్పాలని ఎంతో ఆరాటపడ్డా. కానీ అదే సమయంలో ఈ గొడవ జరిగింది. అందుకే ప్రేమకు ప్రతిరూపమైన ఈ పావురాలను గిఫ్ట్ గా ఇచ్చి, ఐ లవ్యూ ధీరజ్ అని చెప్పడానికి వచ్చానని ప్రేమ అంటుంది. కానీ ధీరజ్ ఆ గిఫ్ట్ ను విసిరి కొడతాడు.

పావురాల గొప్పతనం నీకు తెలుసా? వీటిని ముట్టుకునే అర్హత కూడా నీకు లేదని ప్రేమపై ధీరజ్ కోప్పడతాడు. కింద పడ్డ ముక్కలను ఏరుతుంటే ప్రేమ చేతికి గాయమవుతుంది. కట్టు కట్టాలని ఉందని, కానీ నువ్వు చేసిన నమ్మక ద్రో...