భారతదేశం, ఏప్రిల్ 2 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అన్ని గొడవలకు, బాధలకు కారణం ఎవరో వల్లి అక్కకు తెలుసు అని చందుకు నర్మద చెప్తుంది. దీంతో శ్రీవల్లిని చందు నిలదీస్తాడు. మరి వల్లి ఏం చెప్పింది? ఇంకా ఎవరిని ఇరికించింది? అనేది ఈ రోజు, ఏప్రిల్ 2న ప్రసారం కాబోయే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ లో ఏం జరిగిందన్నది ఇక్కడ చూద్దాం.

తన బిడ్డకు ఏమైపోతుందోనని భాగ్యం కంగారు పడుతుంది. కానీ సందె పొద్దులకాడా అంటూ సాంగ్ పాడుకుంటూ ఇడ్లీ బాబాయ్ ఫుల్ హుషారుతో భార్య దగ్గరకు వస్తాడు. ఆవిడ గారండీ మనం అమ్మడు ఇంటికి రాములోరి కల్యాణానికి వెళ్తున్నామా లేదా? అని ఇడ్లీ అడుగుతాడు. అక్కడికి వెళ్తే మన పెళ్లి అవుతుందని భాగ్యం అంటే, మళ్లీ పెళ్లి ఆ ఊహా ఎంత బాగుందోనని ఇడ్లీ తేలిపోతాడు.

అప్పుడే భాగ్యానికి శ్రీవల్లి ఫోన్ చేస్తుంది. సూపర్ సక్సెస్. ప్ర...