భారతదేశం, ఏప్రిల్ 15 -- Illu Illalu Pillalu April 15 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో తమ్ముడు ధీరజ్ కు చందు నిజం చెప్పేస్తాడు. అమూల్య విషయంలో ప్రేమ ఎలాంటి తప్పు చేయలేదని ధీరజ్ తెలుసుకుంటాడు. మరోవైపు సాగర్ కు ఇచ్చిన అప్పు విషయంలో రామరాజును సేట్ బెదిరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 15 ఎపిసోడ్ లో చూద్దాం.

నిజం తెలుసుకున్న ధీరజ్ ప్రేమపై ప్రేమ ఒలకబోస్తాడు. ప్రేమను వెనుకాల నుంచి హగ్ చేసుకుంటాడు. ప్రేమ నాతో మాట్లాడవా? నువ్వు ఎంత మంచిదానివో నాకు తెలుసు. మా కుటుంబం మీద మీకున్న పగ, నా చెల్లెలి మీద నాకున్న ప్రేమ నీ మాటలు నమ్మే పరిస్థితిని ఇవ్వలేదు. నిన్ను అపార్థం చేసుకున్నా. నా మాటలతో హింసించా, కోపంతో ద్వేషించా. క్షమించరాని తప్పు చేశానని ధీరజ్ ఫీల్ అవుతాడు.

ఈ విషయంలో నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావని ప్రేమ...