భారతదేశం, ఏప్రిల్ 11 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమకు ప్రేమగా అన్నం తినిపిస్తాడు ధీరజ్. ప్రేమ మురిసిపోతుంది. కష్టాల్లో నిన్ను మీ ఇంటికి పంపించామని మీవాళ్లు కాకుల్లా కేకలు పెడతారని చూసుకుంటా అని చెప్పా. దానికి మురిసిపోకు అని ధీరజ్ అంటాడు. అలాగే, అంటాడు కానీ నీపై ధీరజ్‌కు చాలా ప్రేమ ఉందని నర్మద చెబుతుంది.

అదేం లేదు అని ధీరజ్ అంటే.. మరి హాస్పిటల్‌లో ప్రేమకోసం ఎందుకు అంతలా ఏడ్చావ్ అని నర్మద మరిది ధీరజ్‌ను ఇరికిస్తుంది. నీకు ఏమవుతుందో అని అందరిలానే ఏడ్చా, అంతకుమించి ఏం లేదని ధీరజ్ అంటాడు. అదే మగాడు చూపించే నిజమైన ప్రేమ అని నర్మద అంటుంది. తర్వాత యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ అది యాక్సిడెంట్‌లా అనిపించట్లేదు అక్కా. ఎవరో కావాలనే చేశారనిపిస్తుందని ప్రేమ డౌట్ పడుతుంది.

మరోవైపు క్యారెజ్ వ...