భారతదేశం, జూన్ 17 -- Illu Illalu Pillalu 500 Episodes: తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ఇంట్లో టీవీ సీరియల్స్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల బంధాలు, ఎమోషన్స్, రోజువారీ జీవితాల్లో జరిగే ఆసక్తికరమైన సంఘటనల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీరియల్స్ ను ఆడియన్స్ బాగా ఓన్ చేసుకుంటారు.

ఈ కేటగిరీలోనే స్టార్ మాలో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతున్న క్లీన్ ఫ్యామిలీ డ్రామా 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. తాజాగా ఈ సీరియల్ 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నట్లు స్టార్ మా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా అనౌన్స్ చేసింది.

ఈ సుదీర్ఘమైన విజయవంతమైన ప్రయాణం గురించి సీరియల్ టీమ్ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంది. "500 ఎపిసోడ్స్.. ఈ ప్రయాణంలో ఎన్నో భావాలు, మరెన్నో మధురమైన జ్ఞాపకాలు దాగున్నాయి. 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' టీమ్ అందరికీ హృదయపూర్వక అభినందన...