భారతదేశం, ఆగస్టు 14 -- Illu Illalu Pillalu: తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే క్రేజ్ ఉన్న సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. స్టార్ మాలో ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ కు ఫాలోవర్లు ఎక్కువే. సీరియల్ కూడా ఎప్పటికప్పుడూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూ సాగుతోంది. తాజాగా ఓ పెద్ద ట్విస్ట్ చేసుకోబోతోంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో శ్రీవల్లి, భద్రావతి కలిసి కుట్ర చేసి ధీరజ్, ప్రేమను విడగొట్టిన సంగతి తెలిసిందే. గుడిలో అయినా ఎలాగోలా నిజం చెప్పి కన్విన్స్ చేయాలని ధీరజ్ ట్రై చేశాడు. కానీ అక్కడ ధీరజ్ పొరపాటు కారణంగా ప్రేమ జాకెట్ చిరిగింది. దీంతో దూరం ఇంకా పెరిగింది. ప్రేమను తిరిగి తీసుకురావడం ఎలా అని ధీరజ్ బాధపడుతున్నాడు.

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ప్రేమ ఇప్పుడు పుట్టింట్లోనే ఉంటుంది. రామరాజు ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చెప్పినా ...