భారతదేశం, సెప్టెంబర్ 26 -- Illu Illalu Pillalu: సీరియల్ అంటే కేవలం ఏడుపులు, కన్నీళ్లే కాదు ట్విస్ట్ లు, సస్పెన్స్, థ్రిల్ కూడా అని ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చాటుతోంది. ప్రస్తుతం ఈ టాప్ సీరియల్ లో కథ థ్రిల్లర్ సినిమాలా సాగుతోంది. ధీరజ్, ప్రేమ పెళ్లి అవుతుందా? లేదా? అనే ఉత్కంఠ ఆడియన్స్ ను ఊపేస్తోంది.

పెళ్లి చేసుకుందాం రమ్మని ధీరజ్ ప్రేమగా అడిగితే ప్రేమ ఒప్పుకోలేదు. భద్రావతి మాయలో పడ్డ ప్రేమ.. అత్తకు మాట ఇచ్చానని సెంటిమెంట్ డైలాగ్ లు కొడుతుంది. ఎవరేం చెప్పినా ప్రేమ కన్విన్స్ కావడం లేదు. ఇక భద్రావతి ఏమో ఆ చింతామణి ఇంట్లో ప్రేమను దాచింది. దీంతో ప్రేమను తీసుకొచ్చేందుకు నర్మద ప్లాన్ వేసింది.

మంచిగా చెప్తే ప్రేమ వినడం లేదు. అందుకే ప్రేమను కిడ్నాప్ చేయాలని నర్మద ఫిక్స్ అయింది. ఆ పని కోసం బల్లక్కాయ్ అండ్ బ్యాచ్ ను రంగంలోకి దించింది. మోపిదేవిక...