భారతదేశం, మార్చి 6 -- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది.జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 2 పోస్టులున్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన వీటిని రిక్రూట్ చేయనున్నారు.

జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు మార్చి 20వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. కనీసం ఏడాది పాటు పని చేసిన ఉద్యోగానుభవం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ తెలిసి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 20.03.2026 నాటికి 45 ఏళ్లు దాటకూడదు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.25,000 జీతం చెల్లిస్తారు. ఏడాది కాలానికి గానూ రిక్రూట్ చేసుకుంటారు. పని తీరు ఆధారం...