భారతదేశం, మార్చి 22 -- ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.డిప్లొమా, డిగ్రీ, జీఎన్‌ఎం, బీఈ/బీటెక్‌, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు 26 ఉండగా(15 విభాగాలు)... డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీలు 14గా(8 విభాగాలు) ఉన్నాయి.

అర్హత గల అభ్యర్థులు మార్చి 27, 28, 29 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఎంపికైన గ్రాడ్యూయేట్ అప్రెంటిస్ కు నెలకు రూ. 20 వేల స్టైఫండ్ ఇస్తారు. డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 18వేల స్టైఫండ్ చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. పోస్టులను బట్టి ఇంటర్వ్యూ తేదీలను ఖరారు చేశారు. https://www.iittp.ac.in/ వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు. ఇక...