భారతదేశం, నవంబర్ 27 -- పెట్రోల్ ఇగ్నిస్ మోడల్‌ను ఏప్రిల్ 2026లో నిలిపివేసిన కొద్ది నెలలకే సుజుకీ సంస్థ అంతర్జాతీయంగా ఇగ్నిస్ పేరును సరికొత్త ఎలక్ట్రిక్ రూపంలో మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది! 2025 జపాన్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించిన 'విజన్ ఈ-స్కై' కాన్సెప్ట్ ఆధారంగా తయారైన ప్రొడక్షన్ వెర్షన్​ని ఇగ్నిస్ ఈవీగా ప్రపంచానికి పరిచయం చేసింది. 2027లో యూరప్ సహా ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో ఈ కారును విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

మారుతీ సుజుకీ ఈ-విటారాకు ఆధారమైన ప్రత్యేక 'హార్టెక్ట్-ఈ' ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్‌పైనే ఈ సుజుకీ ఇగ్నిస్ ఈవీని రూపొందించారు. నాలుగు సీట్ల సామర్థ్యంతో వచ్చే ఈ ఎలక్ట్రిక్ కారు డబ్ల్యూఎల్‌టీపీ లెక్కల ప్రకారం 310 కిలోమీటర్ల రేంజ్, ఆధునిక క్యాబిన్ సౌకర్యాలు, నగర ప్రయాణాలకు అనువైన డైమెన్షన...