భారతదేశం, జూన్ 27 -- Idupu Kayitham Title Controversy: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, తెలంగాణ ఫోక్ డాన్సర్ నాగదుర్గ ప్రధాన పాత్రల్లో వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇడుపు కాయితం'. ఇప్పుడు ఈ సినిమా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

చిత్ర యూనిట్ ఇడుపు కాయితం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినప్పటి నుంచి ఈ సినిమా టైటిల్ చుట్టూ భాషా వివాదం, ప్రాంతీయ అస్తిత్వంతో ముడిపడిన పెద్ద చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఒక వర్గం నెటిజన్లు తెలంగాణ వాడుక భాషలో ఉన్న ఈ టైటిల్‌ను ఎగతాళి చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది.

"ఈ సినిమాను ఆంధ్రా భాషలోకి డబ్ చేస్తారా?", "తెలుగులో సబ్‌టైటిల్స్ ఉంటాయా", "సర్ తెలుగు భాషలో డబ్ చేస్తారా?..లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా?. సబ్ టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హ్యాపీ అవుతాం ఆంధ్రోళ్లమ్", "ఆంధ్రాలో తెల...