భారతదేశం, జూలై 27 -- ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ అద్భుతమైన త్రైమాసిక ఫలితాలతో స్టాక్ మార్కెట్లో అదరగొట్టింది. ఏప్రిల్-జూన్ (క్యూ1 ఎఫ్​వై27) త్రైమాసికంలో కంపెనీ ఊహించిన దానికంటే మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో బీఎస్‌ఈలో బ్యాంక్ షేరు ధర ఏకంగా 9.48 శాతం ఎగిసింది.

గత సెషన్‌లో రూ.80.83 వద్ద ముగిసిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు, సోమవారం ఉదయం రూ.85.70 వద్ద లాభాలతో ప్రారంభమయ్యాయి. ఫలితాల జోరుతో ఇంట్రాడేలో ఒక దశలో గరిష్టంగా రూ.88.70 స్థాయికి చేరుకున్నాయి.

ఇక ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్ షేరు ధర 5శాతం లాభాలతో 85.88 వద్ద ట్రేడ్​ అవుతోంది.

జులై 25న బ్యాంక్ తన మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. వడ్డీ ఆదాయం పెరగడం, నిబంధనల ప్రకారం కేటాయించే ప్రొవిజన్లు తగ్గడంతో ని...