భారతదేశం, మార్చి 16 -- సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నప్పటికీ, ఐడీబీఐ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసిన వారు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు! ఇందుకు కారణం ఐడీబీఐ బ్యాంక్ షేరులో కనిపిస్తున్న భారీ పతనం. ఉదయం ట్రేడింగ్ సెషన్ ఓపెన్ అవుతూనే ఈ ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్ షేర్లు ఏకంగా 15శాతం క్రాష్ అయ్యాయి.
ఈ బ్యాంక్లో మెజారిటీ వాటాను విక్రయించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రద్దయ్యే అవకాశం ఉందన్న నివేదికల మధ్య ఈ పతనం సంభవించింది.
ఉదయం ఓపెన్ అవుతూనే.. బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేరు ధర 15.34% తగ్గి రూ. 78.05కి చేరుకుంది. ఇది 52 వీక్-లో స్థాయి అయిన రూ. 72.04 కి చేరువలో ఉంది. ట్రేడింగ్ వాల్యూమ్స్ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఉదయం 10 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ఈ స్టాక్ 14.95శాతం నష్టాలతో 78....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.