భారతదేశం, జూన్ 6 -- Ice Cream Man Trailer Released: ప్రపంచవ్యాప్తంగా హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. హాలీవుడ్‌లో సైకో థ్రిల్లర్లు, స్లాషర్ జోనర్ చిత్రాలకు వీక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనూ 'కంజూరింగ్', 'ఇన్సిడియస్' వంటి ఇంగ్లీష్ హారర్ సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తుంటుంది.

ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ, హారర్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ ఎలి రాత్ నుంచి వస్తున్న సరికొత్త చిత్రమే 'ఐస్ క్రీమ్ మ్యాన్'. తాజాగా విడుదలైన ఈ సినిమా అఫీషియల్ రెడ్ బ్యాండ్ ట్రైలర్ నెటిజన్లను వణికించేలా ఉండటమే కాదు చూస్తుంటే సుస్సు పోయించేలా ఉంది.

ఆగస్టు 7న ఉత్తర అమెరికా వ్యాప్తంగా దాదాపు 2,000 థియేటర్లలో ఐస్ క్రీమ్ మ్యాన్ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 'ది హారర్ సెలెక్షన్' సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న ఐస్ క్రీమ్ మ్...