భారతదేశం, సెప్టెంబర్ 16 -- పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ(iBomma) నిర్వహించిన ఇమంది రవికి సంబంధించిన వ్యవహారంలో మరోసారి తెరపైకి వచ్చింది. తన బ్యాంక్ ఖాతాల్లో ఫ్రీజ్ (సీజ్) చేసిన దాదాపు రూ. 3 కోట్లను విడుదల చేయాలంటూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఖాతాలు స్తంభించిపోవడం వల్ల కుటుంబ పోషణ తీవ్ర భారంగా మారిందని, రోజువారీ అవసరాలకు సైతం ఇబ్బందులు పడుతున్నానని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

ఈ పిటిషన్‌పై నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. భారతదేశంలోనే అత్యంత భారీ ఆన్‌లైన్ పైరసీ నెట్‌వర్క్‌పై విచారణలో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు రవికి చెందిన బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల డిపాజిట్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.

విశాఖపట్నం జిల్లాకు చెందిన 39 ఏళ్ల ఇమంది రవి (ఐబొమ్మ రవి) కరిబీయన్ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. నవంబర్ 2025ల...