భారతదేశం, మార్చి 31 -- భారత వాహనదారులకు గుడ్​ న్యూస్​ ఇచ్చింది హ్యుందాయ్​ మోటార్స్​ సంస్థ. గతేడాది మార్కెట్​లోకి విడుదలైన '2025 హ్యుందాయ్ వెన్యూ', తాజాగా భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (బీఎన్​సీఏపీ) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. పెద్దల రక్షణ, పిల్లల రక్షణ అనే రెండు విభాగాల్లోనూ ఈ ఎస్​యూవీకి ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ రేటింగ్ లభించింది.

ప్రధానంగా డీజిల్ వేరియంట్లయిన హెచ్​ఎక్స్​2, హెచ్​ఎక్స్​10 మోడళ్లను పరీక్షించగా ఈ ఫలితాలు వచ్చాయి. అయితే, వెన్యూ లైనప్‌లోని మిగిలిన వేరియంట్లకు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ ఎస్​యూవీ మొత్తం 32 పాయింట్లకు గాను 31.15 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించింది.

ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్: ఇందులో 16 పాయింట్లకు గ...