భారతదేశం, అక్టోబర్ 30 -- భారత ఆటోమొబైల్ విపణిలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో లభించే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విభాగంలో తమ ఆధిపత్యాన్ని చెలాయించేందుకు దక్షిణ కొరియా వాహన దిగ్గజం 'హ్యుందాయ్ మోటార్ ఇండియా' సరికొత్త మాస్టర్ ప్లాన్‌తో ముందుకొచ్చింది! సబ్-4 మీటర్ పరిధిలో అత్యంత తక్కువ ధరకే లభించే సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌లో ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ నయా ఎలక్ట్రిక్ కారు కోసం హ్యుందాయ్ 'ఐయోనిక్ పీ' (Ioniq P) అనే పేరును భారతదేశంలో అధికారికంగా ట్రేడ్‌మార్క్ రిజిస్టర్ చేసింది. కంపెనీ లోపల 'HE1i' అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చెందుతున్న మాస్-మార్కెట్ ఈవీకే ఈ పేరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు ఆటోమొబైల్ వర్గాలు పేర్కొంటున్నాయ...