భారతదేశం, సెప్టెంబర్ 17 -- భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త 'బేయాన్' ఎస్​యూవీని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది దిగ్గజ హ్యుందాయ్ మోట్ర్స్. అక్టోబర్-నవంబర్ పండుగ సీజన్ నాటికి ఈ కారును అధికారికంగా మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో విశేష ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ వెన్యూ, క్రెటా కార్ల మధ్య ఈ కొత్త బేయాన్ ఎస్‌యూవీ కొలువుదీరనుంది.

ఇక ఇప్పుడు ఈ కొత్త ఎస్​యూవీకి సంబంధించి కొన్ని కొత్త విషయాలు తెలిసాయ. ఈ బేయాన్ ఎస్​యూవీ సీఎన్జీ ఆప్షన్​తో, లెవల్​-2 అడాస్​ ఫీచర్లతో రానుంది!

సాధారణంగా సీఎన్జీ కార్లలో డిక్కీ (బూట్) స్పేస్ అంతా గ్యాస్ సిలిండర్ ఆక్రమిస్తుంది. కానీ, హ్యుందాయ్ బేయాన్ కారులో ఈ సమస్యకు చెక్ పడుతున్నారు. 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న కార్లలో సీఎన్జీ ఆప్షన్‌త...