భారతదేశం, జూలై 28 -- హైదరాబాద్‌లోని చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడే ప్రక్రియలో తాము పూర్తి రాజ్యాంగ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామని హైడ్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48A కల్పిస్తున్న హక్కులు, బాధ్యతల ప్రకారమే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు.

గడిచిన రెండేళ్ల కాలంలో ల్యాండ్ మాఫియా, భూకబ్జాదారుల బారి నుంచి సుమారు రూ. 1.50 లక్షల కోట్ల (17 బిలియన్ డాలర్లు) విలువైన ప్రభుత్వ ఆస్తులను హైడ్రా స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. ఆక్రమణల చెరలో ఉన్న వందలాది చెరువులు, పార్కులకు విముక్తి కల్పించడమే కాకుండా, ఆరు చెరువులను ఇప్పటికే పూర్తి స్థాయిలో పునరుద్ధరించామని ఆయన తెలిపారు. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.

తమపై ...