భారతదేశం, జూన్ 14 -- భాగ్యనగరంలో వర్షాకాలం ఆరంభమైంది. నగరంలో కురుస్తున్న గాలీవానలు, భారీ వర్షాలు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం అరగంట, గంట వ్యవధిలోనే ఏకంగా 10 సెంటీమీటర్ల మేర అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. దీంతో ఓవైపు రహదారులు వ‌రద నీటితో ముంచెత్తుతుంటే.. మరోవైపు ఈదురు గాలులకు భారీ చెట్లు, కొమ్మలు విరిగి దారికడ్డంగా పడిపోతున్నాయి. ఫలితంగా నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి, అత్యవసర సహాయక చర్యలు చేపట్టడానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాధారణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) భారీ వాహనాలు వెళ్లేందుకు వీలులేని ఇరుకు మార్గాల్లోనూ తక్షణమే స్పందించేందుకు 'హైడ్రా బైక్ టీమ్‌లు' రంగంలోకి దిగాయి. గతంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బైక్ టీమ్‌లను ప్రారంభిం...