భారతదేశం, మార్చి 17 -- హైదరాబాద్ న‌గ‌రంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్ర‌భుత్వ‌, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 11 ఎక‌రాల భూమిని హైడ్రా కాపాడింది. మార్కెట్లో వీటి విలువ రూ. 1650 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. ఇందులో 2 ఎక‌రాలు పార్కు కోసం కేటాయించిన‌ది కాగా.., 5 ఎక‌రాలు స్మ‌శాన వాటిక‌తో పాటు 4 ఎక‌రాల డంప్ యార్దుకు చెందిన‌ది ఉంది.

హైడ్రా విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ విలేజ్లోని సెంట్ర‌ల్ పార్కు కాల‌నీలో పార్కు కోసం 2 ఎక‌రాలు కేటాయించారు. స‌ర్వే నంబ‌రు 110/1 లో 148 ప్లాట్ల‌తో 16 ఎక‌రాల మేర సెంట్ర‌ల్ పార్కు కాల‌నీ ఫేజ్‌-1 పేరుతో 1998లో లే ఔట్ వేశారు. ఇందులో 2 ఎక‌రాల‌ను పార్కు కోసం కేటాయించ‌గా.. మున్సిప‌ల్ అధికారులు పార్కు స్థ‌లంగా హ‌ద్దులు నిర్ధారించి ప్ర‌హ‌రీ కూడా నిర్మించారు. ఇలా పార్కు కోసం...