భారతదేశం, అక్టోబర్ 17 -- Hyderabad Water Shortage : భాగ్యనగర వాసులను ముందస్తుగానే తాగునీటి తిప్పలు చుట్టుముట్టాయి. సాధారణంగా ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో కనిపించే నీటి ఎద్దడి... ఈసారి అక్టోబర్ మాసంలోనే మొదలై నగరవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. ఎల్‌నినో ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, దానికితోడు భూగర్భజలాలు దారుణంగా అడుగంటిపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు గృహావసరాల నుంచి పారిశ్రామిక అవసరాల వరకు ప్రతిదానికీ జలమండలి నీటి ట్యాంకర్లే దిక్కవుతున్నాయి.

జలమండలి అధికారిక గణాంకాలు నగరంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో రోజుకు సగటున 3 వేల నుంచి 4 వేల ట్యాంకర్ల బుకింగ్స్ నమోదు కాగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య ఏకంగా రెట్టింపై 7 వేలకు చేరింది. ఇప్పటివరకు ఐట...