భారతదేశం, నవంబర్ 27 -- ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ సున్నం చెరువులోకి వర్షపు నీరు చేరింది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో చెరువు సరికొత్త జలకళను సంతరించుకుంది. కొద్దిపాటి వర్షం పడినా వరద నీరు చెరువులోకి చేరేలా అధికారులు ఇన్లెట్లను అభివృద్ధి చేయటంతో.పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు నేరుగా సున్నం చెరువులోకి చేరింది.

డిసెంబర్ 2 లేదా 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చెరువును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో వర్షం కురవడం, ఆ నీరు చెరువులోకి చేరడం మంచి పరిణామంగా స్థానిక ప్రజలు భావిస్తున్నారు.

గతంలో ఆక్రమణలకు గురై, మురికి కూపంగా మారిన సున్నం చెరువును హైడ్రా పునరుద్ధరించింది. ఒకప్పుడు 14 ఎకరాలకు కుంచించుకుపోయిన ఈ చెరువు విస్తీర్ణాన్ని హైడ్రా 32 ఎకరాలకు పెంచింది. చెరువుకు పూర్వ వైభవం తీసుకురావడ...