భారతదేశం, నవంబర్ 10 -- సొంత ఇల్లు లేదా ప్లాటు కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. భారీ ఆర్థిక మొత్తంతో కూడుకున్న వ్యవహారం కావడంతో, రియల్ ఎస్టేట్‌లో చేసే చిన్న పొరపాటు కూడా జీవితకాల సంపాదనను ప్రమాదంలో పడేస్తుంది! అందుకే రియల్ ఎస్టేట్‌లో అడుగుపెట్టేముందే ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయడం చాలా అవసరం.

మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రియల్ ఎస్టేట్ రంగానికి విపరీతమైన ఆదరణ ఉంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కోకాపేట, తెల్లాపూర్ వంటి ఐటీ కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల నుంచి విజయవాడ, విశాఖపట్నం, అమరావతి వంటి ప్రధాన నగరాల వరకు స్థిరాస్తి విపణి వేగంగా విస్తరిస్తోంది. అయితే ప్రకటనలు చూసి తొందరపడి నిర్ణయం తీసుకోకుండా, పెట్టుబడి పెట్టే ముందు పరిశీలించాల్సిన 8 కీలక అంశాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

స్థిరాస్తి విలు...