భారతదేశం, మే 4 -- Hyderabad Outer Ring Road safety: హైదరాబాద్‌ మహానగరానికి మణిహారంగా భావించే ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఇప్పుడు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించే ఈ రహదారిపై చిన్నపాటి అజాగ్రత్త కూడా ప్రాణాపాయానికి దారితీస్తోంది.

ఈ నేపథ్యంలో వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీస్ యంత్రాంగం, రోడ్డు భద్రతా విభాగం కీలక హెచ్చరికలు జారీ చేశాయి. ఓఆర్ఆర్ పై ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన భద్రతా ప్రోటోకాల్స్‌ను విస్మరిస్తే ప్రాణాలకే కాదు, మీ జేబుకు కూడా చిల్లు పడటం ఖాయమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు బ్రేక్ డౌన్ వంటి అనివార్య కారణాలు మినహా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను రహదారిపై నిలపకూడదు. చాలామంది విశ్రాంతి కోసమో, ఫోన్ మాట్లాడటానికో లేదా ...