భారతదేశం, సెప్టెంబర్ 3 -- పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరో 12 వారాల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

07097 హైదరాబాద్ - మంగళూరు సర్వీస్ ప్రతి బుధవారం 09.09.2026 నుండి 25.11.2026 మధ్య నడుస్తుంది. మెుత్తం 12 సర్వీసులు ఉంటాయి.

07098మంగళూరు - హైదరాబాద్ నడుమ ప్రతీ గురువారం 10.09.2026 నుండి 26.11.2026 తేదీ దాకా 12 సర్వీసులు ఉంటాయి.

ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో స్టాపేజీలు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని పలు కీలక స్టేషన్లలో ఆగుతాయి. బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, సేడ...