భారతదేశం, అక్టోబర్ 11 -- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని బొల్లారం పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో దారుణం వెలుగుచూసింది. శనివారం నుంచి కనిపించకుండా పోయిన ఓ మైనర్ బాలిక.. ఆదివారం తెల్లారేసరికి విల్లాలోని వాటర్ ట్యాంక్‌లో శవమై తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బొల్లారం పోలీసుల కథనం ప్రకారం.. కౌకూర్ ప్రాంతంలోని 'విల్లా ఆర్చిడ్స్' అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో శనివారం ఒక చిన్నారి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా బాలిక జాడ దొరకలేదు. ఆదివారం ఉదయం విల్లాలోని నీటి ట్యాంక్‌ను పరిశీలించగా అందులో బాలిక మృతదేహం కనిపించింది.

ట్యాంక్‌లో చిన్నారి కాళ్లు, చేతులు తీగలు లేదా తాళ్లతో ముడివేసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగింది కాదని. పక్కా ప్రణాళిక ప్రకారం జరిగి...