భారతదేశం, అక్టోబర్ 5 -- రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అక్టోబర్ 2, 3 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏకంగా 380 మంది వాహనదారులు పట్టుబడ్డారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, ఇతర ప్రయాణికులకు కూడా ముప్పుగా మారుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన మొత్తం 380 మందిలో 343 మంది ద్విచక్ర వాహనదారులు కాగా, 12 మంది ఆటో రిక్షాల డ్రైవర్లు, 25 మంది నాలుగు చక్రాల వాహనాలు తదితర వాహనాలను నడుపుతున్నవారు ఉన్నారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. పట్టుబడిన వారి శరీరంలో రక్తపు మద్యపాన సాంద్రత (BAC) స్థాయిలు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది:

మద్యం తాగి వాహనం నడిపే విషయంలో ఎట్టి పర...