భారతదేశం, జూలై 10 -- Hyderabad Bonalu 2026 : హైదరాబాద్ నగరంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే ఆషాడ బోనాల ఉత్సవాలు ఇక్కడి గంగా జమున తెహజీబ్ (లౌకిక స్ఫూర్తి) ప్రత్యేకతను చాటుతాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాల నిర్వహణ, ముస్లిం పండుగల సందర్భాల్లో హిందూ, ముస్లిం సమాజాలు ఒకరికొకరు అందించుకునే పరస్పర సహకారం యావత్ దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందని ఆమె కొనియాడారు.

గోల్కొండ కోటలోని చారిత్రక జగదాంబికా అమ్మవారి దేవస్థానంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాల ఉన్నత స్థాయి సమన్వయ సమీక్షా సమావేశం జరిగింది. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, అన్ని ప్రభుత్వ శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేస...