భారతదేశం, నవంబర్ 26 -- టెక్ దిగ్గజం యాపిల్ భారతదేశంలో తన రిటైల్ సామ్రాజ్యాన్ని మరింత వేగంగా విస్తరిస్తోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణే నగరాల తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వంతు వచ్చింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో యాపిల్ తన నూతన అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. యాపిల్ కూకట్‌పల్లి(Apple Kukatpally) పేరుతో రాబోతున్న ఈ స్టోర్ డిసెంబర్ 10వ తేదీన వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

కూకట్‌పల్లి వై-జంక్షన్ సమీపంలోని ప్రతిష్టాత్మక లేక్ షోర్-వై జంక్షన్ మాల్ వేదికగా ఈ సరికొత్త యాపిల్ స్టోర్ కొలువుదీరనుంది. భారతదేశంలో యాపిల్ ప్రారంభిస్తున్న ఏడవ అధికారిక స్టోర్ ఇది. భారత్‌లో యాపిల్ ఆఫ్‌లైన్ రిటైల్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. తొలుత ముంబైలోని యాపిల్ బీకేసీ(Apple BKC)తో ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత వరుసగా ఢిల్లీలోని యాపిల్ సాకేత్, బ...