భారతదేశం, నవంబర్ 25 -- హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA) కార్గో (సరకు రవాణా) సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంది. శంషాబాద్ విమానాశ్రయ కార్గో టెర్మినల్‌లో ఆధునీకరించిన ఎలివేటెడ్ ట్రాన్స్‌ఫర్ వెహికల్(ETV) ఆధారిత స్టోరేజ్ వ్యవస్థను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(GHIAL) తాజాగా అందుబాటులోకి తెచ్చింది.

ఈ కొత్త వ్యవస్థ ఏర్పాటుతో ఎయిర్‌పోర్ట్ సరకు నిల్వ, రవాణా సామర్థ్యం రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడమే కాకుండా, అత్యంత సున్నితమైన ఫార్మా ఉత్పత్తుల రవాణాకు సరికొత్త వేగం లభించనుంది. ప్రస్తుత కార్గో టెర్మినల్ విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం లేకుండానే, కేవలం వర్టికల్ స్టోరేజ్ సాంకేతికతను జోడించడం ద్వారా ఎయిర్‌పోర్ట్ అధికారులు ఈ అద్భుతమైన ఫలితాన్ని సాధించారు. దీనివల్ల తక్కువ స్థలంలో ఎక్కువ సరకును సురక్షితంగా భద్రప...