భారతదేశం, మార్చి 10 -- గత కొంతకాలంగా అవినీతి అధికారులు భరతం పడుతోంది తెలంగాణ ఏసీబీ. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. తాజాగా మల్కాజ్ గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి చిక్కారు. రూ. లక్ష లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం.. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు ప్రమోద్ గౌడ్, జాతవత్ బాబు నాయక్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఓ సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా సెక్షన్ 35 BNSS (గతంలో సెక్షన్ 41ఏ Cr.P.C.) కింద నోటీసు ఇచ్చేందుకు రూ. 1,00,000 లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడి నుంచి ఈ డబ్బులను తీసుకుంటుండగా ఎల్.బి....