భారతదేశం, ఫిబ్రవరి 14 -- జీహెచ్‌ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్) పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) ను ఏర్పాటు చేసింది. ఇటీవలనే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ గురించి ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇక ప్రస్తుత జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతోంది. కొత్తగా సైబరాబాద్ తో పాటు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్లను కలిపి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు.సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లతో జీహెచ్ఎంసీ కొనసాగనుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....