Hyderabad : వరకట్న మృతి కేసు - సీజ్ చేసిన నగలు, డబ్బును కాజేసిన కానిస్టేబుల్!
భారతదేశం, అక్టోబర్ 31 -- హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. న్యాయాన్ని కాపాడాల్సిన కానిస్టేబుల్ అక్రమాలకు పాల్పడ్డాడు. వరకట్న హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన విలువైన ఆస్తులు, నగదును స్వార్థం కోసం వాడుకున్నాడు. ఈ ఆరోపణలపై అతనిపై కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గట్ల పద్మ అనే మహిళ తన కుమార్తె హేమ మృతిపై ఫిర్యాదు చేసింది. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు వరకట్నం కోసం తీవ్ర వేధింపులకు గురిచేయడంతోనే తన కుమార్తె ఉరేసుకుని మృతి చెందిందని జులై 30న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారణ సమయంలో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు ఆధారాల సేకరణలో భాగంగా పంచనామా నిర్వహించి నిందితుల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.