భారతదేశం, మార్చి 5 -- మ‌రో రెండు చెరువులు హైదరాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్నాయి. పాత‌బ‌స్తీలోని బ‌మృకున్ - ఉద్‌- దౌలా చెరువుతో పాటు.. కూక‌ట్ ప‌ల్లిలోని న‌ల్ల చెరువు ప్రారంభానికి సిద్ధ‌మ‌య్యాయి. ఈ నెల 8వ తేదీన బ‌మృకున్ - ఉద్ - దౌలా చెరువును ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. 9వ తేదీన కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును కూడా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగానే ప్రారంభించి.. ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.

హైడ్రా మొద‌ట విడ‌త చేప‌ట్టిన 6 చెరువుల్లో ఇప్ప‌టికే అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ కుంట గ‌తేడాది సెప్టెంబ‌రు 28న‌ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. మ‌రో మూడు చెరువులు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. వీటికి తోడు రెండో విడ‌త మ‌రో 14 చెరువుల‌ను హైడ్రా అభివృద్ధి చేయ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇలా న‌గ‌రంలో మురికి కూపాలుగా మారిన చెరువుల రూపు...