భారతదేశం, మే 11 -- హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిబావి, ఇందిరా నగర్ కాలనీలో ఈ నెల 7వ తేదీ రాత్రి జరిగిన బీటెక్ విద్యార్థి బొమ్మన యావన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కా పథకం ప్రకారం, ఈ ఘాతుకానికి ఒడిగట్టిన 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మృతుడు యావన్ ఒక యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడనే విషయాన్ని సదరు యువతి కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో మే 7వ తేదీ రాత్రి సుమారు 9:45 గంటల ప్రాంతంలో, నిందితులు మారణాయుధాలతో యావన్‌పై మెడ, ఇతర కీలక శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేశారు. యావన్ మరణించాడని నిర్ధారించుకున్నాక అక్కడి నుండి పరారయ్యారు.

మృతుడి తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు Cr. No.231/2026 U/s. 103(1), 189(1)(4), 191(3) r/w 3(5) BNS కింద...