భారతదేశం, అక్టోబర్ 19 -- హైదరాబాద్ నగరంలో తాగునీటి సంరక్షణపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. వేసవి సమీపిస్తున్న తరుణంలో నీటి కొరత తలెత్తకుండా ఉండాలంటే ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వాడుకోవడం అత్యంత అవసరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగరంలో ఎక్కడైనా తాగునీటి వృథా లేదా దుర్వినియోగం జరుగుతున్నట్లు గమనిస్తే.. వెంటనే తమకు సమాచారం అందించాలని మహానగర పౌరులకు జలమండలి విజ్ఞప్తి చేసింది.

తాగునీటి దుర్వినియోగానికి సంబంధించిన ఘటనలు పౌరుల దృష్టికి వచ్చిన వెంటనే స్పందించేందుకు అధికారులు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

పౌరుల నుంచి అందిన ప్రతి ఫిర్యాదుపై జలమండలి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తక్షణమే విచారణ చేపడతారు. ఈ తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘన లేదా నీటి వృథా నిర్ధారణ అయితే, సదరు వ్యక్తులు లేదా సంస్థలపై జలమండలి చట్టపరమైన విధివిధానాల ప...